×

Are you suffering from infertility and pregnancy related issues?

Upto 50% Off on Fertility Treatments

CAPTCHA Image

No need to worry, your data is 100% safe with us!

భారతదేశం లో జననాల రేటు ఎందుకు తగ్గుతుంది? తాజాగా ఏం జరుగుతుందో చూద్దాం!

టోటల్ ఫెర్టిలిటీ రేటు (మొత్తం సంతానోత్పత్తి రేటు) అంటే ఏమిటి ?

టోటల్ ఫెర్టిలిటీ రేటు (టిఎఫ్ఆర్) అనేది ఒక కీలకమైన జనాభా సూచిక. ఒక మహిళ తన పిల్లల్ని కానే వయసులో, సగటున ఎంత మంది పిల్లల్ని కంటుంది అని చూపిస్తుంది. అయితే , ఇప్పుడు ఏ వయసులో ఉన్న ఆడవాళ్ళు పిల్లల్ని కoటున్నారో తెలుసుకుని దాని ఆధారంగా, అదే విధంగా ముందు పిల్లల్ని కంటారని భావించి ఈ లెక్క వేస్తారు. జనాభా ఎలా పెరుగుతోంది, భవిష్యత్తులో జనాభా ఎలా ఉండబోతోంది అని అంచనా వేయడానికి ఇది చాలా ముఖ్యమైన కొలమానం.

సరళంగా చెప్పాలంటే, టిఎఫ్ఆర్ అంటే ఒక మహిళ తన పిల్లల్ని కానే వయసు (దాదాపు 15 నుంచి 49 ఏళ్ల మధ్య), ఇప్పుడున్న పిల్లల్ని కానే రేటు ప్రకారమే పిల్లల్ని కంటూ ఉంటే ఎంతమంది పిల్లల్ని కంటుందో చెప్పే లెక్క. మరీ ముఖ్యంగా, 2.1 టిఎఫ్ఆర్ ని పరిగణం లోకి తీసకుంటే, జనాభా ఒక తరం నుంచి ఇంకో తరానికి మారుతుంది కానీ పెరగదు లేదా తగ్గదు. అంటే పుట్టినవాళ్ళ సంఖ్య చనిపోయిన వాళ్ళ సంఖ్యకు దాదాపు సమానంగా ఉంటుంది అన్నమాట. దీన్నే ‘రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ’ అంటారు.

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సంతానోత్పత్తి రేటు

భారతదేశంలో, గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుట్టే రేటు తగ్గుతూ వస్తోంది. 2019-21 మధ్య తీసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్-5) ప్రకారం, భారతదేశం యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేటు (టిఎఫ్ఆర్) ఇప్పుడు 2.0 గా నమోదు అయ్యింది. అంటే ఒక జంట తమ జీవితకాలంలో సగటున ఇద్దరు పిల్లలనే కంటుంది.

క్షీణిస్తున్న ఈ సంతానోత్పత్తి రేటు, భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి, ఎందుకంటే ఇది స్థిరమైన జనాభా వృద్ధి రేటు వైపు దేశం యొక్క పరివర్తనను సూచిస్తుంది. అయితే, బీహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.4), జార్ఖండ్ (2.3) వంటి కొన్ని రాష్ట్రాల్లో పిల్లలు పుట్టే రేటు ఎక్కువగా ఉంటే, పశ్చిమ బెంగాల్ (1.6), తమిళనాడు (1.6), కేరళ (1.7) వంటి రాష్ట్రాల్లో పిల్లలు పుట్టే రేటు తక్కువగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి నమూనాలను ప్రభావితం చేసే విభిన్న సామాజిక-ఆర్ధిక మరియు సాంస్కృతిక కారకాలను ప్రతిబింబిస్తుంది.

భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి గల కారణాలు

భారతదేశంలో పిల్లలు పుట్టే రేటు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో, ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు, సమాజంలో మరియు ఆర్ధికంగా వచ్చిన మార్పులు, అలాగే కుటుంబ నియంత్రణ గురించి ప్రజల ఆలోచనల్లో మరియు సంస్కృతిలో వచ్చిన మార్పులు చెప్పుకోవచ్చు. అవేంటంటే:

స్వాతంత్ర్యం అనంతరం కుటుంబ నియంత్రణ సంక్షేమ కార్యక్రమాలు

1952లో మొదలుపెట్టిన “జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం” అనేది ప్రజలకు గర్భనిరోధక పద్ధతుల గురించి తెలియజేయడానికి మరియు వాటిని అందుబాటులో ఉంచడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది. కాలక్రమేణా ఈ కార్యక్రమం చాలా మారింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జంటలకు ఎన్నో రకాల గర్భనిరోధక ఎంపికలు మరియు కౌన్సెలింగ్ సేవల శ్రేణిని అందిస్తుంది.

తల్లి మరియు శిశు ఆరోగ్యంలోని మెరుగుదలలు

తల్లుల మరియు పిల్లల ఆరోగ్య సేవలు మెరుగు పడటం కూడా పిల్లలు పుట్టే రేటు తగ్గడానికి ఒక కారణం. ఇప్పుడు గర్భంతో ఉన్నప్పుడు మంచి వైద్యం అందుబాటులో ఉండటం, కాన్పు చేసేటప్పుడు శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం, మరియు కాన్పు తర్వాత కూడా మంచి సంరక్షణ ఉండటం వల్ల పిల్లలు మరియు తల్లులు చనిపోయే ప్రమాదం తగ్గింది. దీనివల్ల కూడా చాలామంది తక్కువ మంది పిల్లల్ని కనడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇంకా చెప్పాలంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన జననీ సురక్ష యోజన (JSY) మరియు ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (PMSMA) వంటి పథకాలు తల్లుల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపర్చాయి మరియు ఎక్కువ మంది ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి.

ప్రవర్తనా సరళిలో మార్పులు

కుటుంబం యొక్క పరిమాణం గురించి ప్రజల ఆలోచనలు మరియు సామాజికంగా వస్తున్న మార్పులు కూడా భారతదేశంలో పిల్లలు పుట్టే రేటు తగ్గడానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో చదువుకున్న వారి సంఖ్య పెరగడంతో, చిన్న కుటుంబాల వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి తెలుస్తోంది. చిన్న కుటుంబం ఉంటే మంచిగా బతకవచ్చు, పిల్లలకు మంచి చదువు చెప్పించవచ్చు మరియు ఆర్థికంగా కూడా స్థిరంగా ఉండవచ్చు అని చాలామంది భావిస్తున్నారు.

తరతరాల సంపద బదిలీలో మార్పులు

ఇంతకుముందు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పిల్లల్ని పెద్దయ్యాక తమకు ఆర్థికంగా సహాయం చేస్తారని మరియు తమకు అండగా ఉంటారని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది చిన్న కుటుంబాలుగా ఉంటున్నారు, పట్టణాల్లో ఎక్కువమంది నివసిస్తున్నారు, మరియు కొంతవరకు సామాజిక భద్రతా పథకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దానితో ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు మరియు వారి మంచి భవిష్యత్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్దయ్యాక పిల్లలు తమను చూసుకుంటారనే ఆలోచనతో కాకుండా, తమ పిల్లలను బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలని అనుకుంటున్నారు.

మహిళా సాధికారత

చదువుకోవడం వల్ల, ఉద్యోగాలు చేయడం వల్ల మరియు ఇంట్లో కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం పెరగడం వల్ల మహిళలు ఇప్పుడు చాలా శక్తిమంతులు అయ్యారు. ఇది కూడా పిల్లలు పుట్టే రేటు తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం. మహిళలకు తమ శరీరం గురించి మరియు పిల్లల్ని ఎప్పుడు కనాలని అనే దాని గురించి మంచి అవగాహన వస్తోంది. అలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు కూడా అందుబాటులో ఉండటంతో, వాళ్ళు ఎంత మంది పిల్లల్ని కనాలని అనుకుంటే అంత మందినే కనడానికి వీలు కలుగుతోంది. తమకు ఉన్న అవకాశాలను బట్టి, తమ భవిష్యత్తును ఆలోచించుకుని పిల్లల గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.

కుటుంబ నియంత్రణ ఎంపికగా దత్తత తీసుకోవడం

సంతానోత్పత్తి రేటు తగ్గడానికి దత్తత ప్రత్యక్ష కారణం కానప్పటికీ,పిల్లలు కనలేని లేదా కనకూడదు అనుకునే జంటలకు ఇది ఒక మంచి ఎంపికగా మారుతోంది. చట్టపరమైన దత్తత సేవల లభ్యత మరియు పిల్లలను కనడానికి ఆచరణీయ ప్రత్యామ్నాయంగా దత్తత గురించి పెరుగుతున్న అవగాహన జంటలకు అదనపు కుటుంబ నియంత్రణ ఎంపికను అందించాయి. అంటే, పిల్లలు కావాలనుకునే వాళ్ళు కచ్చితంగా తమకే పుట్టాలని లేదు, దత్తత కూడా తీసుకోవచ్చు అనే ఆలోచన పెరుగుతోంది.

భారతదేశ సంతానోత్పత్తి రేటును ప్రపంచ ధోరణులతో పోల్చడం

భారతదేశంలో పిల్లలు పుట్టే రేటు తగ్గడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక సాధారణమైన విషయం. చాలా దేశాల్లో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం, ప్రపంచ సగటు టోటల్ ఫెర్టిలిటీ రేటు 1950-1955లో ఒక మహిళకు 5.0 మంది పిల్లలు ఉండగా, 2015-2020 నాటికి అది 2.5 కి పడిపోయింది.

యూరప్ మరియు ఉత్తర అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పిల్లలు పుట్టే రేటు చాలా తక్కువగా ఉంది. కొన్నిసార్లు అది 2.1 అనే స్థాయి కంటే కూడా తక్కువగా ఉంది. అదే సమయంలో, ఆఫ్రికా మరియు ఆసియాలోని కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లలు పుట్టే రేటు ఇంకా ఎక్కువగా ఉంది. అయితే అక్కడ కూడా క్రమంగా ఈ రేటు తగ్గుతూ వస్తోంది.

సంతానోత్పత్తి రేటును తగ్గించడం యొక్క పరిణామాలు

పిల్లలు పుట్టే రేటు తగ్గడం సాధారణంగా సమాజం మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది అని చూపిస్తుంది. కానీ దానితో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తాయి, వాటిని మనం తప్పకుండా పరిష్కరించాలి. అవేంటంటే:

జనాభా సవాళ్ళు

పిల్లలు పుట్టే రేటు చాలా కాలం పాటు తక్కువగా ఉంటే, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అంటే, పనిచేసే వయసులో ఉన్నవాళ్ల కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. దీనివల్ల సామాజిక భద్రతా పథకాల మీద, ఆరోగ్య సంరక్షణ మీద మరియు దేశం యొక్క ఆర్థికంగా ఎదిగే దాని మీద ఒత్తిడి పెరుగుతుంది.

అంతేకాకుండా, జనాభా తగ్గిపోతే పనిచేసేవాళ్ళు కూడా తగ్గిపోతారు. దీనివల్ల పరిశ్రమల్లో మరియు ఇతర రంగాల్లో మనుషులు దొరకడం కష్టమై, దేశం యొక్క ఆర్థికాభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది.

అభివృద్ధియేతర వ్యయంలో పెరుగుదల

జనాభా వయసు పెరుగుతున్న కొద్దీ, వైద్య సేవలు, పెన్షన్ నిధులు మరియు ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల అభివృద్ధికి ఉపయోగపడని ఖర్చులు పెరుగుతాయి. రోడ్లు, విద్య మరియు దేశం యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బు సరిపోదు.

కార్మిక కొరత వల్ల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు

పిల్లలు పుట్టే రేటు తగ్గిపోతే, పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇది దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి మరియు స్థిరత్వానికి పెద్ద సమస్యగా మారొచ్చు. ముఖ్యంగా చేతితో చేసే పనులు లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన పరిశ్రమల్లో మనుషులు దొరకడం కష్టమవుతుంది. దీనివల్ల కార్మికుల జీతాలు పెరిగి, ఆ పరిశ్రమలు ఇతర దేశాలతో పోటీ పడటం కష్టం అవుతుంది.

నవకల్పన కోసం తగ్గిన టాలెంట్ పూల్

జనాభా తక్కువగా ఉంటే, కొత్త ఆలోచనలు చేసేవారు , పరిశోధనలు చేసేవారు మరియు కొత్త విషయాలు కనిపెట్టేవారి సంఖ్య కూడా తగ్గుతుంది. టెక్నాలజీ చాలా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, ఇది ఒక దేశం యొక్క పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మరియు ప్రపంచంతో పోటీ పడటంలో వెనుకబడే ప్రమాదం ఉంది.

సంభావ్య సామాజిక అసమతుల్యతలు

కొన్నిసార్లు, పిల్లలు పుట్టే రేటు బాగా తగ్గిపోతే, సమాజంలో కొన్ని తేడాలు వచ్చేస్తాయి. ఉదాహరణకు, ఆడవారి సంఖ్య లేదా మగవారి సంఖ్యలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, లేదా ఒక ప్రాంతంలో జనాభా ఎక్కువ, ఇంకో ప్రాంతంలో తక్కువ ఉండొచ్చు. ఇలాంటి తేడాల వల్ల సమాజంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది మరియు అందరూ కలిసిమెలిసి ఉండటం కూడా కష్టమవుతుంది.

తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును నిర్వహించడానికి వ్యూహాలు

పిల్లలు పుట్టే రేటు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వాలు మరియు విధానాలు రూపొందించే వారు కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అవేంటంటే:

పురుషులు కుటుంబ పనులు పంచుకోవాలి

సాధారణంగా, ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడం వంటి బాధ్యతలను ఎక్కువగా ఆడవాళ్లే చూసుకుంటున్నారు. దీనివల్ల చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలన్నా లేదా ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి, మగవాళ్ళు  కూడా ఇంటి పనుల్లో మరియు పిల్లల ఆలనా పాలనలో ఎక్కువ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి. ఇంట్లో పనులు అందరూ సమానంగా పంచుకుంటే ఆడవాళ్ళ మీద భారం తగ్గుతుంది. బహుశా ఇది పిల్లలు పుట్టే రేటు పెరగడానికి కూడా సహాయం చేయవచ్చు.

ఆర్థిక విధానాలు మరియు ఎజెండాలను సవరించడం

పిల్లలు పుట్టే రేటు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాలను మార్చుకోవలసి ఉంటుంది. పనిచేసే తల్లిదండ్రులకు సహాయం చేసేలా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు, పిల్లలు పుట్టినప్పుడు జీతంతో కూడిన సెలవు ఇవ్వడం, తక్కువ ఖర్చుతో పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు ఉద్యోగాల్లో సౌకర్యవంతమైన పని వేళలను ప్రవేశపెట్టడం వంటివి చేయాలి.

అలాగే, ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేయడానికి మరియు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రోత్సహించే విధానాలు కూడా జనాభా తగ్గడం వల్ల వచ్చే కార్మికుల కొరతను తగ్గించడంలో సహాయపడతాయి.

నైతిక మరియు సమర్థవంతమైన వలసల కొరకు విధానాలను రూపొందించడం

కొన్నిసార్లు, కొన్ని దేశాలు తమలో పనిచేసేవాళ్ళ కొరతను తీర్చడానికి మరియు కార్మికుల కొరతను అధిగమించడానికి నియంత్రితంగా మరియు నీతిగా వలసలను ప్రోత్సహించే విధానాలను పరిశీలించవచ్చు. అయితే, అటువంటి విధానాలను చాలా జాగ్రత్తగా రూపొందించాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, సమాజంలో అందరూ కలిసి ఉండేలా చూడాలి మరియు దేశం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.

స్త్రీ వంద్యత్వానికి మరియు పురుషుల వంద్యత్వానికి ఆశ మరియు పరిష్కారాలు కోసం చూస్తున్నారా? మా సమగ్రమైన సేవలను అన్వేషించండి.

ఐసిఎస్ఐ చికిత్స

పిఐసిఐ చికిత్స

సంతానోత్పత్తి సంరక్షణ సేవ

బ్లాస్టోసిస్ట్ సంస్కృతి మరియు బదిలీ చికిత్స

ముగింపు:

భారతదేశంలో పిల్లలు పుట్టే రేటు తగ్గుతూ రావడం అనేది జనాభా పరంగా ఒక ముఖ్యమైన మలుపు. ఇది మన దేశం యొక్క సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదుగుదలను చూపిస్తుంది. అంతేకాకుండా, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి మరియు మహిళలను శక్తి వంతులుగా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఫలిస్తున్నాయి అని చెప్పవచ్చు. అయితే, ఈ మార్పు వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. వాటిని ముందుచూపుతో సరైన విధానాలు మరియు ప్రణాళికల ద్వారా పరిష్కరించుకోవాలి.

పనిచేసే తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పిస్తూ, విద్య మరియు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, పిల్లలు పుట్టే రేటు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను భారతదేశం సులభంగా ఎదుర్కోగలదు. అలా చేస్తూనే, స్థిరమైన అభివృద్ధి మరియు అందరికీ సమానమైన వృద్ధిని సాధించవచ్చు.

మా క్లినిక్ ని సందర్శించండి:

హైదరాబాద్ లో ఫెర్టిలిటీ క్లినిక్

విశాఖపట్నం లో ఫెర్టిలిటీ క్లినిక్

విజయవాడ లో ఫెర్టిలిటీ క్లినిక్

కరీంనగర్ లో ఫెర్టిలిటీ క్లినిక్

వరంగల్ లో ఫెర్టిలిటీ క్లినిక్

రాజమండ్రి లో ఫెర్టిలిటీ క్లినిక్

తిరుపతి లో ఫెర్టిలిటీ క్లినిక్

కుర్నూల్ లో ఫెర్టిలిటీ క్లినిక్


FAQ's

ఫెర్టిలిటీ రేటు మరియు ఫెర్టిలిటీ రేషియో కి మద్య ఉన్న తేడా ఏమిటి?
ఫెర్టిలిటీ రేటు అనేది ఒక మహిళ తన పిల్లలు కనే వయస్సులో సగటున ఎంత మంది పిల్లలను కంటుందో తెలియజేస్తుంది, ఇది టోటల్ ఫెర్టిలిటీ రేటు (TFR)గా పిలుస్తారు. ఫెర్టిలిటీ రేషియో లేదా సాధారణ సంతాన రేటు (GFR) అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో, 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 1,000 మంది మహిళలకు ఎంత మంది శిశువులు జన్మించారో తెలియజేస్తుంది.
ఒక దేశానికి “ఉత్తమ సంతానోత్పత్తి రేటు” గా ఎప్పుడు పరిగణిస్తారు?
సాధారణంగా 2.1 సంతానోత్పత్తి రేటును 'భర్తీ స్థాయి సంతానోత్పత్తి'గా పరిగణిస్తారు. ఇది ఒక తరం తమ సంఖ్యను తగినంతగా భర్తీ చేసుకునే స్థాయి. ఇది వృద్ధుల జనాభా మరియు శ్రామిక శక్తి సమతుల్యతను కాపాడేందుకు అవసరం. ఈ స్థాయికి మించి లేదా తక్కువ రేట్లు సమాజంపై ప్రభావం చూపవచ్చు.
పట్టణీకరణ భారతదేశంలో సంతానోత్పత్తి రేటును ఎలా ప్రభావితం చేస్తుంది?
పట్టణీకరణ వలన భారతదేశంలో చిన్న కుటుంబాల పట్ల అభిరుచి పెరుగుతోంది. పల్లె ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చేవారు జీవనశైలిని మార్చుకుంటున్నారు, ఇది పిల్లల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది.
భారతదేశంలోని సంతానోత్పత్తి రేటును కాలుష్యం ఎలా ప్రభావితం చేస్తుంది?
గాలి కాలుష్యం మరియు రసాయనాల ప్రభావం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. PM2.5, NOx, SO2 వంటి కాలుష్య కారకాలు శరీరంలో ఒత్తిడిని పెంచి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది పురుషులలో వీర్య నాణ్యతను తగ్గించడమే కాకుండా, మహిళలలో గర్భస్రావం మరియు పుట్టుక లోపాలను పెంచుతుంది.
Faq Image

Leave a Comment